pralayam.com

మొన్నామధ్యన డైనమిక్ లేడీ కలక్టర్ గా ‘భాగమతి’ సినిమాలో అనుష్క మెప్పించింది. ఆడియన్స్ కూడా హీరోయిన్లను అలా కలక్టర్ వంటి ఉన్నతమైన మరియు ఎంతో డిగ్నిఫైడ్ పదవుల్లో చూస్తుంటే చాలా బాగా అనిపిస్తోందని చాలామంది క్రిటిక్స్ కూడా అంటున్నారు. అదిగో ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన నయనతార కూడా అదే పాత్రతో అలరించడానికి వస్తోంది.

ఆ మధ్యన తమిళంలో రిలీజై భలే ఉందే అనిపించుకున్న సినిమా ఆరమ్. నయనతార ఈ సినిమాలో కలక్టర్ గా కనిపిస్తూ.. అక్కడి నుండి ప్రజల కోసం ఏం చేసింది అనేదే సినిమా. ఇప్పుడు తెలుగులో ఈ సినిమా ‘కర్తవ్యం’ పేరుతో రాబోతోంది. అప్పట్లో ఇదే పేరుతో మరో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక సినిమాతో వస్తే.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. చూస్తుంటే ఇప్పుడు నయన్ కూడా అదే తరహాలో హిట్టు కొట్టాలని ఉవ్విళ్ళూరుతోంది. పైగా ఈ మధ్యన సోషల్ డ్రామాలు జనాలను బాగా కదిలిస్తున్న వేళ.. మసాలా సినిమాలకు పోటీగా వసూళ్ళు కూడా సాధిస్తున్న వేళ.. మరి నయన్ ఎంతోకొంత ఇపం్రెస్ చేస్తుందనే ట్రేడ్ వర్గాలు నమ్ముతున్నాయి.

ఇకపోతే ఈ టీజర్ లో.. ప్రజల కోసం చేసే చట్టాలు వారి అవసరాలు తెలుసుకుని చేయాలి కాని.. ముందే చట్టాలు చేసి వాటిని ప్రజలపై రుద్దకూడదంటూ ఆమె చెప్పే మాటలు ఎక్కడో గట్టిగా తగులుతున్నాయ్ అని వేరే చెప్పక్కర్లేదు. మార్చి 16న నయనతార ‘కర్తవ్యం’ విడుదలవ్వనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here