latest telugu news updates

తెలుగు రాష్ట్రాలలో మూడు జిమ్‌లు కలిగిన నేను ఫిట్‌గా ఉండకపోతే జనం మాత్రమేకాదు.. నా జిమ్‌లకు వచ్చేవారు కూడా నవ్వుతారు. మనం ఒకరిని ఫిట్‌గా ఉండమని చెప్పాలంటే ముందు మనం ఫిట్‌నెస్‌తో ఉండాలి అని అన్నారు నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉండటానికంటూ ప్రత్యేకంగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరిట తన అధికారిక యాప్‌ను విడుదల చేశారామె. ఈ సందర్భంగా మీడియాతో చిట్‌ చాట్‌ చేశారు. ఆ విశేషాలు..

యాప్‌ అవసరమెందుకంటే..
సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నాకు మరలా ప్రత్యేకంగా యాప్‌ అవసరమెందుకొచ్చిందీ అని అంటే అభిమానులతో మరింత ఇంటరాక్టివ్‌గా ఉండటానికే అని చెప్పాలి. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఇలా అన్ని ఫ్లాట్‌ఫామ్స్‌లోనూ అభిమానులున్నారు. అయితే ఎవరు నాకు పెద్ద ఫ్యాన్‌ అనేది తెలుసుకోవడంతో పాటుగా అందరికీ తగిన సమాధానాలివ్వడానికి ఈ యాప్‌ తోడ్పడుతుంది. నా సోషల్‌ మీడియా ఖాతాలన్నీ ఈ యాప్‌తో అనుసంధానించబడటం వల్ల తక్షణమే నా అభిమానులతో మాట్లాడటానికి సమయం చిక్కుతుంది.

ఈ స్థాయిలో ఉన్నది వారి వల్లనే..!
నేనీ స్థాయిలో ఉన్నానంటే అది అభిమానుల వల్లనే అని ప్రగాఢంగా నమ్ముతాను నేను. మనల్ని అభిమానించే వారికి మరింత దగ్గరగా ఉండటానికి ఈ యాప్‌ నాకు దోహదపడుతుంది. వారికి ప్రత్యేకంగా పోటీలను పెట్టేందుకు, వారితో ప్రత్యేక అంశాలను పంచుకునేందుకు.. ఒకటేమిటి వారితో అసమానమైన సాన్నిహిత్యం పొందేందుకు ఇది తోడ్పడుతుంది. అలాగే నా వ్యక్తిగత జీవితాంశాలను తెలుసుకోగలరు.

ఫ్యాన్స్‌కు పోటీలెలా ఉంటాయంటే..
ఫ్యాన్స్‌కు పోటీలెలా ఉంటాయంటే.. అనుక్షణం వారిని ఉత్సాహపరిచే రీతిలోనే ఉంటాయి. ఉదాహరణకు హెలికాఫ్టర్‌ రైడ్‌ విత్‌ రకుల్‌! నాతో హెలికాఫ్టర్‌ సవారీ చేయాలంటే నా యాప్‌పై వారు నెంబర్ 1 ఫ్యాన్‌గా నిలవాల్సి ఉంటుంది. అలాగే వారితో మీట్‌ అండ్‌ గ్రీట్‌‌.. ఇలా వినూత్నంగా ప్లాన్‌చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఫ్యాన్స్‌కు ఖచ్చితంగా ఆనందం కలిగించేవని నమ్ముతున్నాను. త్వరలోనే ఆ వివరాలు తెలుపుతాను.

ముణ్ణాళ్ల ముచ్చట కాదు..
గతంలో కొంతమంది ఇలా యాప్‌లు విడుదల చేసి తరువాత కొంతమంది సైలెంట్‌ అయ్యారా.. ఆ సంగతి నాకు తెలీదు. నేను సిన్సియర్‌గా నా అభిమానులతో టచ్‌లో ఉండటానికి ట్రై చేస్తా. మూడు నాలుగు నెలల తరువాత ఖాళీ లేదంటూ అభిమానులకు దూరంగా ఉండేదేమీ ఉండదు. నిజానికి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా నేను ఉంటాను కాబట్టి ఇది నాకు బెస్ట్‌ ఫ్లాట్‌ఫామ్‌ అనుకుంటున్నా..!

స్ఫూర్తి ఎవరంటే..
ఈ యాప్‌ ఫ్లాట్‌ఫామ్‌లోకి రావడానికి న్యూయార్క్‌కు చెందిన ఎస్కేపెక్స్‌ స్ఫూర్తి. ఆ సంస్థ ఎంతోమంది సెలబ్రిటీలకు ఈ తరహా యాప్‌లు రూపొందించింది. వారు ఈ కాన్సెప్ట్‌ చెప్పగానే వెంటనే ఓకే చెప్పాను.

ఫిట్‌నెస్‌ గురించి..
మూడు జిమ్‌ల ఓనర్‌ను అయిన నేను ఫిట్‌గా ఉండకపోతే ఎలా..? హైదరాబాద్‌లో రెండు, వైజాగ్‌ ఒక జిమ్‌ ఉన్నాయి. సరైన డైట్‌, మంచి వర్కవుట్స్‌ అంతే! జిమ్‌ల విస్తరణ ప్రణాళికలంటే.. ఇటీవలనే వైజాగ్‌లో స్టార్ట్‌ చేశా. కాబట్టి ప్రస్తుతానికి ఆ ఆలోచన ఏమీ లేదు..!

తెలుగులో అవకాశాలు లేవా.. అనడం కరెక్ట్ కాదు..
ప్రస్తుతం తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నాను. తమిళంలోనే మూడు సినిమాలు చేస్తున్నాను. వాటిలో సెల్వరాఘవన్‌ చిత్రంతో పాటుగా కార్తీ, శివకార్తికేయన్‌ చిత్రాలు ఉన్నాయి. హిందీలో అజయ్‌ దేవగన్‌తో ఓ చిత్రంలో చేస్తున్నాను. ఇక ఖాళీ ఎక్కడుంది..? తెలుగులో లేవా అనడం తప్పు. జూన్‌, జులైలలో ఒక తెలుగు చిత్రం ఉంటుంది. అదేమిటన్నది త్వరలోనే ఎనౌన్స్‌ చేస్తా… అని ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here