pralayam.com

ఈ సంవత్సరం విడుదలైన అన్ని సినిమాలలో తొలిప్రేమ సినిమా కలెక్షన్స్ హైలైట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాతో.. విడుదలైన చాలా సినిమాలు దుకాణం సర్దుకుని ఇంటికెళ్లి పోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తొలిప్రేమ సినిమా రిలీజ్ అయి మూడు వారాలు కావస్తున్నా సినిమా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం.

ప్రస్తుతం ఇటు తెలుగు రాష్ట్రాల్లో.. అటు అమెరికాలో ఎక్కువ వసూళ్లు రాబడుతున్నది ‘తొలి ప్రేమ’ చిత్రమే. దీనికి మిగతా సినిమాలకు అంతరం చాలా ఉంది. ఇప్పటికే తొలి ప్రేమ సినిమా హవా తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతోంది. తొలి ప్రేమ షేర్ ఇప్పటికే రూ.25 కోట్లు దాటింది. ఫుల్ రన్ లో ఈ సినిమా రూ.30 కోట్ల మార్కును అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది మెగా కాంపౌండ్ నుండి ఫస్ట్ విజయం సాధించిన హీరో వరుణ్ తేజ్ అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here