pralayam.com

ముంబయి: ఈ ఏడాది ఐపీఎల్‌ టోర్నీలో ఏప్రిల్‌ 7నుంచి పోటీలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క రోజు ముందు అంటే 6న క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో అంగరంగ వైభవంగా ప్రారంభ వేడుకలను నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐతే ప్రారంభ వేడుకల తేదీలో మార్పుతో పాటు వేదిక కూడా మారినట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

ఏ రోజు అయితే పోటీలు ప్రారంభమవుతాయో.. అంటే ఏప్రిల్‌ 7.. అదే రోజు ప్రారంభ వేడుకలను వాంఖడే మైదానంలో నిర్వహించాలని సుప్రీంకోర్టు నియమించిన పాలకుల కమిటీ తాజాగా నిర్ణయం తీసుకుందట. అలాగే రూ.50కోట్లు పెట్టి ఈ వేడుకలను నిర్వహించాలని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సి్‌ల్‌ నిర్ణయం తీసుకోగా.. రూ.20 కోట్లు తగ్గించి రూ.30కోట్లతోనే కార్యక్రమాన్ని ముగించాలని కమిటీ సభ్యులు సూచించినట్లు సమాచారం. బడ్జెట్‌లో కోత, వేడుకల తేదీలో మార్పుతో ఐపీఎల్‌ నిర్వహకులు షాక్‌కు గురయ్యారు. ఏప్రిల్‌ 7న ప్రారంభమయ్యే ఐపీఎల్‌ మెగా టోర్నీ మే 27తో ముగియనుంది. ముంబయి ఇండియన్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here