pralayam.com

కొలంబో: ముక్కోణపు టీ20 సిరీస్‌ కోసం బయలుదేరిన రోహిత్‌ శర్మ సేన కొలంబో చేరుకుంది. భారత్‌-బంగ్లాదేశ్‌-శ్రీలంక మధ్య మంగళవారం నుంచి టోర్నీ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం టీమిండియా బయలుదేరిన సంగతి తెలిసిందే.

టీమిండియా ఆటగాళ్లు కొలంబో చేరుకున్న వీడియోను శ్రీలంక క్రికెట్‌ బోర్డు ట్విటర్‌ ద్వారా పంచుకుంది. భద్రతా సిబ్బంది నడుమ ప్రత్యేక బస్సులో ఆటగాళ్లు హోటల్‌కు చేరుకున్నారు. హోటల్‌ సిబ్బంది ఆటగాళ్లకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సిరీస్‌ కోసం కోహ్లీ, ధోనీ, భువనేశ్వర్‌, బుమ్రా, హార్దిక్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్‌కు విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. టోర్నీ కోసం బంగ్లాదేశ్‌ జట్టు ఆదివారమే కొలంబో చేరుకుంది. టోర్నీలో భాగంగా భారత్‌-శ్రీలంక మధ్య మంగళవారం తొలి మ్యాచ్‌ జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here