pralayam.com

నిన్న పొద్దున్నే హైదరాబాద్ ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ కనిపించడం తరువాయి.. అసలు వీళ్లు ఎక్కడికి వెళ్తున్నారు అంటూ నానా హంగామా మొదలైపోయింది. అదిగో ఇద్దరూ కలసి లాస్ ఏంజెలస్ లో రాజమౌళి సినిమా కోసం ఫోటో షూట్ చేయించుకోవడానికి వెళ్తున్నారనే టాక్ వచ్చింది. దాదాపు పిఆర్ వర్గాలు కూడా అదే కన్ఫామ్ చేశాయి. అయితే వీరిరువురూ వేరే పనిమీద కూడా అమెరికాకు వెళ్ళారట.

నిజానికి రంగస్థలం సినిమాలోమాసిన గెడ్డంతో మాస్ లుక్కులో కనిపించిన రామ్ చరణ్.. తదుపరి చేయబోయే సినిమా కోసం కొత్త లుక్కులో కనిపించాలని అనుకుంటున్నాడు. అలాగే ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ సినిమా కోసం కేవలం ఫిట్నెస్ ఒక్కటే కాకుండా అప్పట్లో నాన్నకు ప్రేమతో సినిమాలో ఎలాగైతే లండన్ లో ఉండే యువకుడిలా కనిపించాడో ఇప్పుడు కూడా అలా ఒక కొత్త మోడ్రన్ ఫ్యాషన్ ఐకాన్ లా కనిపించాలని యోచిస్తున్నాడు. అందుకే ఇద్దరూ అక్కడి ప్రముఖ ఫ్యాషన్ స్టయిలిస్టులను కలసి.. వారితో తమ కొత్త లుక్కులను డిజైన్ చేయించుకుంటారట. కేవలం రాజమౌళి పని ఒక్కటే కాకుండా.. ఇలా అక్కడ తమ ఇతర సినిమాలకు కావల్సిన పనులు కూడా పూర్తి చేస్తారని ఒక టాక్ వినిపిస్తోంది. మొత్తానికి అసలు ఈ మెగా అండ్ నందమూరి హీరో కలసి సినిమా చేస్తున్నారంటేనే ఒక పెద్ద సెన్సేషన్ అయితే.. ఇలా కలసి అమెరికా వెళ్ళి.. అక్కడ స్టయిలింగులూ గట్రా కలసి చేయించుకుంటున్నారంటే.. అసలు వినడానికే భలే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here