pralayam.com

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతూనే ఉంది.. చంద్రబాబు నాయుడు డైవర్ట్ చేయాలని చూసినా, ప్రత్యేక హోదాతో ప్రయోజనం లేదని అనేక సార్లు చెప్పినా.. వైకాపా ఒకటే అజెండాను పట్టుకుంది. ఏపీ డెవలప్ కావాలంటే దానికి ప్రత్యేకహోదానే మార్గం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతూనే ఉంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు అనేక మార్లు మాట మార్చాడు. పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు కు అనుగుణంగానే మాట్లాడాడు. ప్యాకేజీ బాగుంది అని గతంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన వీడియోలున్నాయి. ఒకదశలో ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత చంద్రబాబు చెప్పాడని ప్యాకేజీ బాగుందని ప్రకటించాడు.

అయితే ఇప్పుడు జేఎఫ్‌సీ.. అధ్యయనం అంటూ వచ్చిన పవన్ కల్యాణ్.. అంతిమంగా ప్రత్యేక హోదా కావాలని అంటున్నాడు. చాలా అధ్యయనం తర్వాత పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా మాట మళ్లీ ఎత్తాడు. ఆ మధ్య ప్యాకేజీని సమర్థించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు హోదా అంటున్నాడు. తమ అధ్యయనంలో అదే తేలిందని అంటూ ఉన్నాడు. మరి ఈ విధంగా జగన్ బాణీలోకే వచ్చింది పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన కమిటీ కూడా.

ప్రత్యేకహోదా విషయంలో.. చంద్రబాబు అసమర్థతను,మాట మార్పిడిని మాత్రం పవన్ కల్యాణ్ కమిటీ ప్రస్తావించలేదు. ప్రత్యేకహోదా విషయంలో టీడీపీ, బీజేపీలు మాట మార్చిన వైనాన్ని ప్రస్తావించలేదు. కర్ర విరగకుండా పాము చావకుండా వ్యవహరిస్తూ ఉంది ఈ కమిటీ. అంతిమంగా చంద్రబాబు నాయుడు ప్రయోజనాలను కాపాడటం.. ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు ఎంత మాత్రమూ కారణం కాదు.. కేంద్రం మాత్రమే కారణం అనే టోన్ ను పలికించే వ్యూహంతో ఈ కమిటీ పని చేస్తోంది. పవన్ కల్యాణ్ మాత్రమే ఇలా మాట్లాడితే బద్నాం అయిపోతాడు కాబట్టి.. లోక్ సత్తా జేపీని ఉండవల్లిని కలుపుకున్నట్టుగా ఉన్నారు. పక్కా వ్యూహం ప్రకారం వెళ్తున్నారు.

ప్రత్యేకహోదా పోరాటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా కార్యక్రమాలను నిర్వహించింది. విద్యార్థులతో సదస్సులు నిర్వహించింది. హోదా కోసం ఇప్పుడు ఢిల్లీలో పోరుబాట పట్టింది జగన్ పార్టీ. హోదా ఇవ్వం అని కేంద్రం అంటున్నా.. తెలంగాణ కోసం ఆ ప్రాంత ప్రజలు పోరాడినట్టే మనం కూడా పోరాడదాం అని వైఎస్ జగన్ అంటూ ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here