pralayam.com

ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా అంశం మంటలు రాజేస్తోంది. స్పెషల్ స్టేటస్ సాధన కోసం అన్ని పార్టీలు కదంతొక్కాయి. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజాసంఘాలు పోరుబాట పట్టాయి. దేశ రాజధాని హస్తినలో హోదా కోసం ఆందోళనలు చేస్తున్నాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో మహాధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. వైసీపీతోనే ప్రత్యేక హోదా సాధ్యమని తేల్చి చెప్పారు. కేంద్ర మంత్రి వర్గం నుంచి టీడీపీ వైదొలిగి, అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ (JFC) పై విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. జేఎఫ్ సీ తో ఒరిగేదేమీ లేదని అభిప్రాయపడ్డారు. కమిటీలు, నివేదికలతో ప్రజలకు కలిగే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టేందుకే జనసేన పార్టీ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పేరిట నాటకం ఆడుతోందన్నారు. తెరవెనుక ఉండి ఈ తతంగాన్ని నడిపిస్తున్నది చంద్రబాబేనని విజయసాయిరెడ్డి ఆరోపించారు. జేఎఫ్సీ దర్శకుడు, నిర్మాత చంద్రబాబేనని.. పవన్, ఉండవల్లి తదితర సభ్యులంతా పెయిడ్ ఆర్టిస్టులని ఆయన ఎద్దేవా చేశారు.

ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన తృతీయ కూటమిపై ఇప్పటివరకు ఎటువంటి స్పష్టతా లేదని, కాబట్టి ఆ విషయంలో తమ పార్టీ ప్రస్తుతానికి స్పందించబోదని విజయసాయి రెడ్డి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here