pralayam.com

మెక్సికో: అంతర్జాతీయ వేదికలపై భారత క్రీడాకారులు అదరగొడుతన్నారు. తాజాగా మెక్సికోలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ సీనియర్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌ పోటీల్లో మరోసారి త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. హరియాణాకు చెందిన 16 ఏళ్ల మనూ భకర్‌ స్వర్ణం సాధించింది. మహిళల 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో మనూ అగ్రస్థానంలో నిలిచింది.

ఆతిథ్య దేశానికి చెందిన అలెజంద్ర జవాలను వెనక్కి నెట్టి మనూ స్వర్ణం కైవసం చేసుకుంది. జవాల గతంలో రెండుసార్లు ప్రపంచకప్‌ ఫైనల్ విజేతగా నిలిచింది. ఆదివారం మెక్సికోలో జరిగిన మహిళల 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో మనూ 237.5 పాయింట్లతో పసిడిని సొంతం చేసుకుంది. జవాలా(237.1), ఫ్రాన్స్‌కు చెందిన సీలైన్‌ గోబర్‌విల్లే(217) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. మరో భారత క్రీడాకారిణి యసశ్విని సింగ్‌ 196.1పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఈ ప్రపంచకప్‌ పోటీల్లో భారత్‌కు మొత్తం 5 పతకాలు దక్కాయి. ఇందులో రెండు స్వర్ణాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి.

గత ఏడాది ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 49వ స్థానంలో నిలిచిన మనూ ఈ ఏడాది స్వర్ణం సాధించడం విశేషం.

స్వర్ణ పతకం సాధించిన అనంతరం మనూ మీడియాతో మాట్లాడుతూ..‘పసిడిని సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. తొలి ప్రపంచకప్‌ పోటీల్లోనే స్వరణం గెలిచాను. భవిష్యత్తులో మంచి ప్రదర్శనల చేసి మరిన్ని పతకాలు సాధిస్తా’ అని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here