pralayam.com

రాజకీయాలలో శాశ్వత శత్రువులు మిత్రులు వుండరు అని చెబుతుంటారు రాజకీయ పెద్దలు. ఇదే విషయం అర్థం అవుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు గమనిస్తే. గత ఎన్నికలలో నువ్వా? నేనా? అన్నట్టు వ్యవహరించిన టీఆర్ఎస్-తెలుగుదేశం పార్టీలు.. రాబోయే ఎన్నికలలో కలిసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి గెలిచిన చాలామంది నాయకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని తెలంగాణలో తెలుగుదేశం లేకుండా చాలావరకు టీడీపీ నాయకులే టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. తెలంగాణ లో పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి టీఆర్ఎస్ తో పొత్తుకు చంద్రబాబు సంకేతాలిచ్చారని తమ్ముళ్లు అంటున్నారు.

ధైర్యంగా ఉండమని తెలంగాణ తెలుగుదేశం నాయకులతో చంద్రబాబు చెప్పారు. తెలంగాణలో పార్టీకి మళ్లీ జీవం పోయాలంటే తానే స్వయంగా రంగంలోకి దిగుతానన్నారు. ఆ సమయంలో వచ్చే ఎన్నికల్లో అధికారానికి వస్తామని, అసెంబ్లీ మీద టీడీపీ జెండా ఎగరేస్తామని టీ-టీడీపీ అధ్యక్షుడు రమణ అత్యుత్సాహంతో చెప్పారు. అయితే ఈ క్రమంలో టీడీపీ-టీఆర్ఎస్ పొత్తు గురించి టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ దాకా ఈ ప్రతిపాదన వెళ్ళలేదట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here