pralayam.com

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు వద్ద చాలా మంది డైరెక్టర్లు ఆయన కాంపౌండ్ లోనే ఉండిపోతూ చాలా సినిమాలు చేయడం జరిగింది. వీరిలో హరీష్ శంకర్ కూడా ఒకరు. యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ వరుసగా దిల్ రాజు బ్యానర్ లో సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈసారి మాత్రం ‘సీటీమార్‌’ చిత్రాన్ని కృష్ణ నిర్మాణంలో చేస్తానని హరీష్‌ ప్రకటించాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ ‘దాగుడుమూతలు’ అనే సినిమాను దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో చేస్తున్నాడు.

హరీష్ శంకర్ మాదిరిగానే అనిల్ రావిపూడి కూడా ఇప్పటిదాకా దిల్ రాజు కాంపౌండ్ కి అంకితమైపోయాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చాలా సినిమాలు దిల్ రాజు నిర్మించాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ హీరోగా చేస్తున్న సినిమాకు ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ ఆధ్వర్యంలో చేస్తున్నాడని అర్థమవుతుంది. గతంలోనే అనిల్ రావిపూడి ఈ స్టోరీని బాలకృష్ణకు చెప్పారట. ఆ స్టోరీని బాలకృష్ణ వెంటనే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది…..అయితే అప్పట్లో గౌతమిపుత్ర శాతకర్ణి, పైసా వసూల్‌ చిత్రాలతో బాలయ్య బిజీ అయిపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ వెనక్కి వెళ్లింది.

నందమూరి బాలకృష్ణకు సుపరిచితుడైన నిర్మాత సి.కల్యాణ్ ఆధ్వర్యంలో ఈ సినిమాని రావిపూడి చేయడం విశేషం. ఇలా ఒక్కొక్కరు దిల్ రాజు కాంపౌండ్ నుండి బయటికి వచ్చేస్తున్నారు. ఇలాంటి దర్శకులు దిల్ రాజు దగ్గర ఒక అరడజను మంది వరకు వున్నారు. వీరుకూడా దుకాణం సర్దుకోవడానికి రెడీగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దిల్ రాజు కి ఇటీవల డిస్ట్రిబ్యూట్ చేసిన కొంతమంది పెద్ద స్టార్ హీరోల సినిమాలు దిల్ రాజు ఖజానాకు పెద్ద బొక్క పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ దర్శకులు తమ జాగ్రత్తలో భవిష్యత్తు కోసం దిల్ రాజు దగ్గర నుండి బయటకు వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here