latest telugu news updates

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీకి అన్నీ తానై వ్యవహరిస్తోన్న వీరేంద్ర సెహ్వాగ్ మళ్లీ ఐపీఎల్ బరిలో దిగనున్నాడు. ఏప్రిల్ 8న మొహాలీ వేదికగా ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో పంజాబ్ తరఫున ఓపెనింగ్ చేయనున్నాడు. వీరూ తొలి మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలో దిగుతాడని పంజాబ్ ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. పెళ్లి కారణంగా రెగ్యులర్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ ఆరంభ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. దీంతో అతడి స్థానంలో వీరూ ఓపెనింగ్ చేస్తాడని కింగ్స్ ఎలెవన్ తెలిపింది.ఇటీవల జరిగిన ఐస్ క్రికెట్ మ్యాచ్‌ల్లో వీరూ సత్తా చాటాడు. పంజాబ్ ఆటగాళ్లతో కలిసి నెట్ ప్రాక్టీసులోనూ పాల్గొంటున్నాడు. మొదట్లో బౌలర్లకు కాస్త ప్రాక్టీస్ ఇవ్వడానికి నెట్స్‌లోకి దిగినా.. ఇప్పుడు బాగా ఆడుతున్నాడు. దీంతో కెప్టెన్ అశ్విన్, కోచ్ బ్రాడ్ హాడ్జ్, సెహ్వాగ్‌లతోపాటు టీమ్ మేనేజ్‌మెంట్ అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారని కింగ్స్ ఎలెవన్ తెలిపింది.

latest telugu news updates for click here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here