latest telugu news updates

న్యూఢిల్లీ: బాల్‌ టాంపరింగ్‌ వివాదం నేపథ్యంలో ఐపీఎల్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు డేవిడ్‌ వార్నర్‌ స్థానంలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌కు పగ్గాలు దక్కాయి. బాల్‌ టాం పరింగ్‌ కారణంగా క్రికెట్‌ ఆస్రేలియా (సీఏ)చే నిషేధానికి గురైన వార్నర్‌ను ఐపీఎల్‌ నుంచీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సారఽథ్య బాధ్యతలు నిర్వర్తిస్తాడని జట్టు సీఈఓ కె.షణ్ముగం వెల్లడించారు. బాల్‌ టాంపరింగ్‌లో వార్నర్‌ ప్రధాన పాత్రధారుడని తేలడంతో క్రికెట్‌ ఆస్ర్టేలియా అతనిపై ఒక ఏడాది నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ వివాదంతో వార్నర్‌ భవిష్యత్‌లోనూ ఎలాంటి నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం లేకుండాపోయింది. విలియమ్స్‌న్‌ ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీ్‌సలో బిజీగా ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here