pralayam.com

ఫిదాలో భాగమతిగా అందరిని ఫిదా చేసి పారేసిన సాయి పల్లవి ఎంసిఎలో కూడా ఆకట్టుకుంది కాని అది పూర్తిగా నాని వన్ మెన్ షో కావడంతో తనకు పెద్దగా అవకాశం దక్కలేదు. ఇప్పుడు తను మరో ద్విబాషా చిత్రంతో వస్తోంది. అదే కణం. థ్రిల్లర్ తరహాలో రూపొందిన ఈ సినిమాలో మొదటిసారి సాయి పల్లవి ఒక పాపకు తల్లిగా నటించడం సంచలనం రేపుతోంది.

2.0 లాంటి ఇండియాస్ మోస్ట్ కాస్ట్లీ మూవీ రూపొందించిన లైకా సంస్థ నిర్మాణంలో వస్తున్న మూవీ కావడంతో ప్రొడక్షన్ కూడా రిచ్ గా ఉండబోతోంది. సాయి పల్లవి సరసన నాగ శౌర్య హీరోగా నటించినప్పటికీ ఫోకస్ మొత్తం సాయి పల్లవి తోపాటు అందులో నటించిన చిన్న పాప మీదే ఉండటంతో శౌర్య కూడా దీని ప్రమోషన్ విషయంలో అంటీ అంటనట్టుగానే ఉన్నాడు.

ఇక కథ విషయానికి వస్తే ఇది పెళ్లి చేసుకున్న తొలి రోజుల్లోనే సంతానం వద్దనుకునే ఒక యువ జంటకు ఎదురైన అనుభవాల సారం. భ్రూణ హత్యను కాన్సెప్ట్ గా రూపొందిన ఈ మూవీలో సాయి పల్లవికి తెలియకుండా తన గర్భాన్ని విచ్చిన్నం చేస్తారు నాగ శౌర్య కుటుంబీకులు. ఇది సహజంగానే జరిగిందని మొదట భావించిన సాయి పల్లవి తన కడుపులోనే ప్రాణాలు వదిలిన పాప తన చుట్టే తిరుగుతూ హత్యలు చేయటం తెలుసుకుని షాకవుతుంది. తనకు మాత్రమే కనిపించే ఆ పాపతో క్రమంగా అనుబంధం ఏర్పడుతుంది.

తనను పిండంగా ఉన్నప్పుడే చంపిన వాళ్ళను ప్రతీకారం తీర్చుకోవడం మొదలు పెట్టిన ఆ పాప చివరికి తండ్రైన నాగ శౌర్యను కూడా టార్గెట్ చేస్తుంది. మరి సాయి పల్లవి తన భర్తను ఎలా కాపాడుకుంది, ఆ పాపకు ఎలా కడసారి వీడ్కోలు పలికింది అనేది అసలు పాయింట్ అని ఇన్సైడ్ టాక్. హీరొయిన్ అమలా పాల్ మాజీ భర్త విజయ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు బాషల్లో విడివిడిగా షూట్ చేసారు. ప్రియదర్శి పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి ఇంకా నిర్ణయం వెలువడాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here